నాటి కోరవట్టు... నేటి కోరుట్ల... వందల ఏళ్ల నాడే రాజులు, రచయితలకు, వాణిజ్య ఇతర అవసరాల కోసం కోరుట్లలో తయారయ్యే కాగిత౦నకు మంచి డిమాండ్ ఉండేడిది. దాంతో నాడు 'కోరవట్టు'గా పిలువబడిన ఈ గ్రామం నేడు 'కోరుట్ల'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైనులు, చాళుక్యుల కాలములో నిర్మింపబడినట్లు దేవాలయాలు, అక్కడ లబించిన శాసనాల ద్వారా అర్థమవుతున్నది.

Pages

Monday, 25 October 2010

మలి సంధ్యలోను మరువని బోధన

విరామమెరుగని విశ్రాంత(Retired) ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి... అభినందనీయులు

ఇటివల ఒక సందర్భంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు సామ లక్ష్మారెడ్డితో మాములుగా మాటలతో ప్రారంభమైన పరిచయం, ఆయనలోని అకుంఠ దీక్ష, జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన వైనం, పదవి విరమణ పొంది ఎనిమిదేళ్ళు అవుతున్న జీవన మలి సంధ్యలో విద్యార్థుల్లో Play and Teach బోధన కొరకు low cost and no cost teaching aids తయారు చేయడం అబ్బురపరచింది ఆ అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
మాతృభాష బోధనలో పసి పిల్లలు అక్షరాల మద్య భేదాలను గుర్తించడానికి, ఉచ్చారణలో లోపాలు నివారించడానికి పొడి అక్షరాలు, సంయుక్త, ద్విత్వాక్షరాలతో బోధన ఉపకరణాలు 1500 వరకు తయారు చేశారు. వీటితో వారిలో భాష  భయాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని రేకెత్తించి, ఇతర భాషలను నేర్చుకోవడం సులువవుతుంది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పతకాన్ని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డుతో పాటు ముప్పై వరకు వివిధ పురస్కారాలు, బిరుదులు, సన్మానాలు అందుకొన్న ఈయనలో ఎక్కడ కూడా ఆ అహం కనిపించదు. ఇప్పటికి కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామాలలోని వివిధ పాఠశాలలకు వెళ్ళి ప్రాథమిక స్థాయి నుండి సెకండరీ స్థాయి విద్యార్థులతో పాటు (టి.టి.సి) డైట్, బిఎడ్ శిక్షణ ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. సహజంగా కవి, గాయకుడైన లక్ష్మారెడ్డి పద్యాలు, పాటలు, గేయాలు, నాటికలు నేర్పుతున్నారు. సాంఘిక దురాచారాలపై పలు ప్రదర్శనలు ఇస్తున్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ కృష్ణమకాంత్ నుంచి అందుకొంటూ...

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ చంద్రబాబు నుంచి అందుకొంటూ...

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ఉపాద్యాయులకు అవగాహన కల్పిస్తూ జ్ఞాన బోధనకు వయస్సు అడ్డు కాదంటూ ముందుకు సాగుతున్న సామ లక్ష్మారెడ్డి  పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు. ప్రసుతం కరీంనగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మారెడ్డిని (9948357595) అభిన౦దిద్దాం.  

4 comments:

  1. లక్ష్మారెడ్డి గారు ఈ వయస్సు లో కూడా ఇంత పరిశ్రమ చేయడం ... ! మా లాంటి కొత్త తరం ఉపాద్యాయులకు ప్రేరణాదాయకం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక.
    ప్రసాద్ మంచి సమాచారం ఇచ్చారు ..వారిని తప్పక కలుద్దాం.

    ReplyDelete
  2. గురువుగారు మీకు మా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారములు, మీ కృషి అపూర్వం, అనిర్వచనీయం. మీకు, మీ కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ...

    ReplyDelete
  3. అమోఘం, అభినందనీయం మీ ప్రయత్నం.

    ReplyDelete
  4. very very appreciable teacher.

    ReplyDelete