Monday, 3 January 2011
Friday, 17 December 2010
నేత్రపర్వంగా సహస్ర దీపాలంకరణ - ముక్కోటి ఏకాదశి
Saturday, 20 November 2010
వెంకటాపూర్ లో స్వామి వారి కళ్యాణం
వెంకటాపూర్ గుట్టపై గురువారం కన్నుల పండుగగా శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. పల్లకిలో స్వామి వారిని ఊరెంగించి వేద పండితుల మంత్రోచ్ఛారణల మద్య అలివేలుమంగ, పద్మావతిలతో కల్యాణాన్ని కమనీయం గా జరిగింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావులు హాజరయ్యారు.
Friday, 19 November 2010
Saturday, 13 November 2010
కోరుట్లలో ఘణంగా తిరు నక్షత్ర వేడుకలు
లోక రక్షకుడు, ఆపద్బాంధవుడు, కోరినకోర్కెలు తీర్చే శ్రీ వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రమైన తిరు నక్షత్ర సందర్భంగా కోరుట్లలో శనివారం రోజున గణంగా నిర్వహించబడుచున్నాయి. మనసులో కోరినకోర్కేను తలచుకొని "108 ఆలయ ప్రదక్షిణ" చేయడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే వం.దలాది భక్తులు బారులు తీరారు. మహిళలు, విద్యార్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుప్రభాత సేవతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు హరి నామ సంకీర్తన మరియు ఆలయ ప్రదక్షిణ కొనసాగింది. వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.
కన్యా శ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరం - వందే వాత్సల్య నిలయం కల్యాణ గుణ సాగరం
Friday, 5 November 2010
Monday, 25 October 2010
మలి సంధ్యలోను మరువని బోధన
విరామమెరుగని విశ్రాంత(Retired) ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి... అభినందనీయులు
ఇటివల ఒక సందర్భంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు సామ లక్ష్మారెడ్డితో మాములుగా మాటలతో ప్రారంభమైన పరిచయం, ఆయనలోని అకుంఠ దీక్ష, జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన వైనం, పదవి విరమణ పొంది ఎనిమిదేళ్ళు అవుతున్న జీవన మలి సంధ్యలో విద్యార్థుల్లో Play and Teach బోధన కొరకు low cost and no cost teaching aids తయారు చేయడం అబ్బురపరచింది ఆ అనుభవాలను మీతో పంచుకుంటున్నాను.
మాతృభాష బోధనలో పసి పిల్లలు అక్షరాల మద్య భేదాలను గుర్తించడానికి, ఉచ్చారణలో లోపాలు నివారించడానికి పొడి అక్షరాలు, సంయుక్త, ద్విత్వాక్షరాలతో బోధన ఉపకరణాలు 1500 వరకు తయారు చేశారు. వీటితో వారిలో భాష భయాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని రేకెత్తించి, ఇతర భాషలను నేర్చుకోవడం సులువవుతుంది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పతకాన్ని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డుతో పాటు ముప్పై వరకు వివిధ పురస్కారాలు, బిరుదులు, సన్మానాలు అందుకొన్న ఈయనలో ఎక్కడ కూడా ఆ అహం కనిపించదు. ఇప్పటికి కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామాలలోని వివిధ పాఠశాలలకు వెళ్ళి ప్రాథమిక స్థాయి నుండి సెకండరీ స్థాయి విద్యార్థులతో పాటు (టి.టి.సి) డైట్, బిఎడ్ శిక్షణ ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. సహజంగా కవి, గాయకుడైన లక్ష్మారెడ్డి పద్యాలు, పాటలు, గేయాలు, నాటికలు నేర్పుతున్నారు. సాంఘిక దురాచారాలపై పలు ప్రదర్శనలు ఇస్తున్నారు.

![]() |
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ కృష్ణమకాంత్ నుంచి అందుకొంటూ... |
![]() |
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ చంద్రబాబు నుంచి అందుకొంటూ... |
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ఉపాద్యాయులకు అవగాహన కల్పిస్తూ జ్ఞాన బోధనకు వయస్సు అడ్డు కాదంటూ ముందుకు సాగుతున్న సామ లక్ష్మారెడ్డి పలువురికి స్పూర్తిగా నిలుస్తున్నారు. ప్రసుతం కరీంనగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మారెడ్డిని (9948357595) అభిన౦దిద్దాం.
Subscribe to:
Posts (Atom)