నాటి కోరవట్టు... నేటి కోరుట్ల... వందల ఏళ్ల నాడే రాజులు, రచయితలకు, వాణిజ్య ఇతర అవసరాల కోసం కోరుట్లలో తయారయ్యే కాగిత౦నకు మంచి డిమాండ్ ఉండేడిది. దాంతో నాడు 'కోరవట్టు'గా పిలువబడిన ఈ గ్రామం నేడు 'కోరుట్ల'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైనులు, చాళుక్యుల కాలములో నిర్మింపబడినట్లు దేవాలయాలు, అక్కడ లబించిన శాసనాల ద్వారా అర్థమవుతున్నది.

Pages

Saturday, 13 November 2010

కోరుట్లలో ఘణంగా తిరు నక్షత్ర వేడుకలు


లోక రక్షకుడు, ఆపద్బాంధవుడు, కోరినకోర్కెలు తీర్చే శ్రీ వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రమైన తిరు నక్షత్ర సందర్భంగా కోరుట్లలో శనివారం రోజున గణంగా నిర్వహించబడుచున్నాయి. మనసులో కోరినకోర్కేను తలచుకొని "108 ఆలయ ప్రదక్షిణ" చేయడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకే వం.దలాది భక్తులు బారులు తీరారు. మహిళలు, విద్యార్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుప్రభాత సేవతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు హరి నామ సంకీర్తన మరియు ఆలయ ప్రదక్షిణ కొనసాగింది. వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు.

కన్యా శ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరం - వందే వాత్సల్య నిలయం కల్యాణ గుణ సాగరం

No comments:

Post a Comment