సాయిబాబాను దర్శించుకొన్న వేలాది భక్తులు
కోరుట్ల పట్టణ శివారున సాయి రామ నది తీరాన వెలసిన సాయి ని పుణ్య తిథి వేడుకల సందర్బంగా వేలాది భక్తులు దర్శించుకొన్నారు. సోమ వారం వాయుగుండం కారణంగా చిరుజల్లులు పడుతున్న పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెల్లవారుజామున కాకడ హారతితో మొదలైన సాయి పుణ్య తిథి వేడుకలు ఆలయ సంకీర్తన, అభిషేకం, పతకరోహణ, పున్యవచనం, కలశాభిషేకం, విశ్వ కల్యాణ యజ్ఞం తదితర కార్యక్రమాలు రాత్రి వరకు దిగ్విజయంగా కొనసాగాయి. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో పాటు స్థానిక ప్రముకులు హాజరయ్యారు. వేలాదిగా హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశారు.
No comments:
Post a Comment