నాటి కోరవట్టు... నేటి కోరుట్ల... వందల ఏళ్ల నాడే రాజులు, రచయితలకు, వాణిజ్య ఇతర అవసరాల కోసం కోరుట్లలో తయారయ్యే కాగిత౦నకు మంచి డిమాండ్ ఉండేడిది. దాంతో నాడు 'కోరవట్టు'గా పిలువబడిన ఈ గ్రామం నేడు 'కోరుట్ల'గా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైనులు, చాళుక్యుల కాలములో నిర్మింపబడినట్లు దేవాలయాలు, అక్కడ లబించిన శాసనాల ద్వారా అర్థమవుతున్నది.

Pages

Wednesday, 20 October 2010

పూలను పూజించే మన పండుగ బతుకమ్మ.... వీడియో



ప్రపంచ౦లో పూలను పూజించే ఏకైక పండుగ అంటే బతుకమ్మ పండుగ అనే చెప్పుకోవాలి. వివిధ మతాలలో, వర్గాలలో పూలు, పుష్పాలతో తమ ఆరాధ్యదైవాలను పూజించే అలవాటు ఉండగా, మన సంస్కృతిలో పూలనే దేవతగా గౌరమ్మగా పూజించడటం గౌరవప్రదం అభిన౦దనీయం.

3 comments:

  1. రంగు రంగుల పూలతో ,ఎంతో ఉత్సాహంతో భక్తి నిష్టలతో ,అంతే రంగు రంగుల పట్టు వస్త్రాలతో
    మన ఆడపడచులు ప్రక్రుతి అందాలనే తమ ఇంటి ముంగిట ఆవిష్కరించి నట్లుగా ఆనందం తో
    ఆడే బ్రతుకమ్మ వేడుకలను చక్కగా చిత్రీకరించారు అభినందనలు.పుష్పాలతో దేవుళ్ళను
    పూజించడం ,గౌరవనీయ పెద్దల్ని పుష్ప మాలాంకృతుల జేయడం మన దేశాచారం . పుష్పాలనే
    దేవుళ్ళుగా తీర్చి దిద్ది తమ మాంగల్యాలను పది కాలాల పాటు చల్లగా గౌరమ్మను
    తమ ఆట,పాటల ద్వారా వేడుకోవడం మన తెలంగాణా "బ్రతుకమ్మ "పండగకు ఉన్న
    ప్రత్యేకత .
    ఎన్నెన్నో,రంగుల్ని సంతరించుకొని ఎన్నెన్నో వాసనల వెదజల్లినా మన జీవితాలన్నీ తుదకు
    ప్రకృతి ఒడి లోనే ఒదగక తప్పదనే తత్వాన్ని తెలియ జేస్తుందని మనకని పిస్తుంది కదూ!
    " పుష్ప మూలే వసేద్బ్రహ్మ ,పుష్ప మధ్యేచ కేశవః
    పుష్పాగ్రేచ మహా దేవః సర్వ దేవాః స్థితా దలే"
    తా= పుష్పం మొదట బ్రహ్మ ,పుష్ప మధ్యము నందు కేశవుడు,పుష్పము కొన యందు,
    మహ దేవుడు నివసింతురు.దళము నందు సర్వ దేవతలు ఉందురు.

    # పుష్పై ర్దేవాః ప్రసీదంతి పుష్పే దేవాశ్చ సంస్థితాః
    కించాతి బహునోక్తేన పుష్ప స్యోక్తి మతంద్రి కామ్#

    # పరం జ్యోతి: పుష్పగతం పుష్పే ణైవ ప్రసీదతి
    త్రివర్గ సాధనం పుష్పం పుష్టి శ్రీ స్వర్గ మోక్షదం#

    తా: పుష్పములతో దేవతలు ప్రసన్ను లగుదురు.వారు పుష్పము లందు నివసింతురు.
    పుష్పము లందు చైతన్యము స్థితమై ఉన్నది.
    పుష్పము లందున్న పరమాత్మ పుష్పముల చేతనే ప్రసన్నుడగును కావున పుష్పము
    త్రివర్గ సాధనము.పుష్టిని, సిరిని, స్వర్గమును ,మోక్షమును ఇచ్చునది .

    పై శ్లోక తాత్పర్యాలు " T T D తిరుపతి వారి "పుష్ప చింతామణి" ఆను పుస్తకము నుండి
    గ్రహింప బడినవి
    పై వాటి వెలుగులో మన" బ్రతుకమ్మ" పండుగ ఔచిత్యము మరింత వన్నెదాల్చినది గదా !

    ReplyDelete
  2. పీతాంబార్ గారు బాగున్నారా ..!మీ వచనం బాగుంది.ప్రసాద్ మంచి వీడియో. కోరుట్లదేనా ...?

    ReplyDelete
  3. కోరుట్లలో ఈతరం యూత్, సిటి కేబుల్ వారి ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ పోటి కార్యక్రమంనకు సంబందించిన వీడియో నాగరాజు

    ReplyDelete